కడప విద్యార్థినికి అపు‘రూప’ అవకాశం

ABN , First Publish Date - 2022-09-30T09:26:56+05:30 IST

కడప విద్యార్థినికి అపు‘రూప’ అవకాశం

కడప విద్యార్థినికి అపు‘రూప’ అవకాశం

పార్లమెంట్‌లో గాంధీపై ప్రసంగించే చాన్స్‌


కడప(మారుతీనగర్‌), సెప్టెంబరు 29: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2న పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జాతిపితనుద్దేశించి ప్రసంగించే అరుదైన అవకాశం కడప జిల్లా విద్యార్థిని మిద్దె రూపకు దక్కింది. కొండాపురం మండలం కోడూరుకు చెందిన మిద్దె రూప కడపలోని కోటిరెడ్డి మహిళా కళాశాలలో ఈ ఏడాది డిగ్రీ పూర్తిచేసింది. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో ఆమెకు ఈ అవకాశం దక్కిందని నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్‌ కె.మణికంఠ గురువారం తెలిపారు. 

Read more