2న రీ సర్వే పట్టాల పంపిణీ!

ABN , First Publish Date - 2022-09-30T09:22:32+05:30 IST

2న రీ సర్వే పట్టాల పంపిణీ!

2న రీ సర్వే పట్టాల పంపిణీ!

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): భూముల సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్టోబరు 2న రైతులకు పట్టాలు ఇవ్వడానికి సర్కారు నిర్ణయించింది. రీ సర్వే పైలట్‌ ప్రాజెక్టు తర్వాత 2020, డిసెంబరు నుంచి సర్కారు రాష్ట్రంలో భూముల సర్వే చేస్తోన్న సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 2వేల గ్రామాల్లో డ్రోన్‌ సర్వే, అనంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. రీసర్వే ప్రక్రియ ముగిసిందని ఇప్పటికే ఏపీ సర్వే, సరిహద్దుల చట్టం-1923 పరిధిలో ఆ గ్రామాల్లో సెక్షన్‌ 13 నోటిఫికేషన్లు ఇచ్చారు. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు సీఎం జగన్‌ చేతుల మీదుగా భూ యజమానులకు పట్టాలు ఇప్పించేందుకు రెవెన్యూ శాఖ సన్నహాలు చేస్తోంది. అదే రోజున ఆయా గ్రామాల పరిధిలో గ్రామ సచివాలయం కేంద్రంగా భూముల రిజిస్ట్రేషన్‌ను కూడా ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2022-09-30T09:22:32+05:30 IST