పెళ్లిలో ‘అవయవ దానం’!

ABN , First Publish Date - 2022-12-30T03:23:04+05:30 IST

ఓ వివాహ వేడుకలో పెళ్లికానుకల సంగతేమో కానీ.. అవయవదానానికి అంగీకరిస్తూ పత్రాలివ్వడం అందరినీ ఆలోచింపజేసింది.

పెళ్లిలో ‘అవయవ దానం’!

ఓ కొత్త జంట వినూత్న ప్రయత్నం

అద్భుతంగా స్పందించిన బంధుమిత్రులు

68 మంది నుంచి అంగీకారపత్రాలు

నిడదవోలు, డిసెంబరు 29: ఓ వివాహ వేడుకలో పెళ్లికానుకల సంగతేమో కానీ.. అవయవదానానికి అంగీకరిస్తూ పత్రాలివ్వడం అందరినీ ఆలోచింపజేసింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మల్టీపర్పస్‌ కమ్యూనిటీహాలు ఇందుకు వేదికైంది. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన సతీశ్‌కుమార్‌, కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సజీవరాణిల వివాహం గురువారం ఇక్కడ జరిగింది. ముందుగా.. ఈ వివాహ ఆహ్వాన పత్రికల్లోనే ‘అవయదానం చేయండి.. ప్రాణదాతలుకండి’ అంటూ అభ్యర్థించారు. దీనికి బంధుమిత్రుల నుంచి విశేషస్పందన లభించింది. వధూవరులతోపాటు మొత్తం 68 మంది అవయవదాన అంగీకార పత్రాలపై సంతకాలు చేసి విశాఖపట్నం నుంచి వచ్చిన చెందిన సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సంస్థ చైర్మన్‌ గూడూరి సీతామహాలక్ష్మికి అందజేశారు. అవయవదానం చేయడం ఎంతో అవసరమని, దీనిపై అవగాహన పెంచేందుకే ఈ ప్రయత్నం చేశామని నూతన వధూవరులు తెలిపారు.

Updated Date - 2022-12-30T03:23:04+05:30 IST

Read more