కుంటిసాకులతో లబ్ధిదారుల తొలగింపు దారుణం

ABN , First Publish Date - 2022-12-30T02:54:34+05:30 IST

కుంటిసాకులతో లబ్ధిదారుల తొలగింపు దారుణం

కుంటిసాకులతో లబ్ధిదారుల తొలగింపు దారుణం

వ్యవసాయ మీటర్లపై ముందుకు సరికాదు: రాఘవులు

కోతలపై 30న సచివాలయాల వద్ద ఆందోళన: శ్రీనివాసరావు

నెల్లూరు (వైద్యం), డిసెంబరు 29: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ‘నవరత్నాలు’ నుంచి కుంటిసాకులు చూపి లబ్ధిదారులను తొలగించడం దారుణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. గురువారం నెల్లూరులోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ 4 లక్షల పింఛన్లను రద్దు చేసింది. 300 యూనిట్ల కరెంటు వాడారనో, భూములు, పొలాలు ఉన్నాయనో సాకుగా చూపి పెన్షన్లు రద్దు చేయడం దారుణం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం భావించడం సరికాదు. కందుకూరులో జరిగిన టీడీపీ సభలో ఎనిమిది మంది మృత్యువాత పడటం కలిచివేసింది. మృతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి’’ అని రాఘవులు డిమాండ్‌ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో సంక్షేమ పథకాలలో కోత విధిస్తున్నారు. దీనిపై ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాయాల వద్ద ఆందోళన చేపడుతున్నాం’’ అని చెప్పారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T02:54:36+05:30 IST