-
-
Home » Andhra Pradesh » ap news chitoor peddireddy-MRGS-AndhraPradesh
-
పుంగనూరులో జాతీయ జెండాకు అవమానం
ABN , First Publish Date - 2022-08-15T22:03:29+05:30 IST
పుంగనూరులో జాతీయ జెండాకు అవమానం

చిత్తూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో జాతీయ జెండాకు అవమానం ఎదురయింది. చౌడేపల్లి మండలం సచివాలయం వద్ద జెండా ఆవిష్కరణలో ఎంతకూ జెండా విచ్చుకోలేదు. వందేమాతర గీతం ఆలపించిన తర్వాత జెండాను కిందికి దింపి తిరిగి జెండాను ప్రజా ప్రతినిధులు అధికారులు ఆవిష్కరించారు. గత ఏడాది జెండా ఆవిష్కరణలో ఏకంగా జాతీయ జెండా దారం తెగి కింద పడింది. జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన ప్రతిసారి జాతి జెండాకు అవమానం జరుగుతూ... ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది.