ఏపీలో బీజేవైఎం సంఘర్షణ యాత్ర డేట్ ఖరారు

ABN , First Publish Date - 2022-07-23T21:53:02+05:30 IST

ఏపీలో ఆగస్టు 2 నుంచి బీజేవైఎం సంఘర్షణ యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. జగన్‌ సర్కార్ తప్పిదాలపై ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు.

ఏపీలో బీజేవైఎం సంఘర్షణ యాత్ర డేట్ ఖరారు

కడప: ఏపీలో ఆగస్టు 2 నుంచి బీజేవైఎం సంఘర్షణ యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. జగన్‌ సర్కార్ తప్పిదాలపై ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. మహిళలకు రక్షణ లేదన్నారు. అలాగే దిశ చట్టానికి పదును లేదని ఆయన మండిపడ్డారు. అత్యధిక అప్పులు చేసిన అప్పుల అప్పారావు జగన్ అని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. మూడేళ్లలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చలేదన్నారు. దోపిడీ, అవకతవకలు, దాడులకు వ్యతిరేకంగా బీజేపీ యాత్ర ఉంటుందని తెలిపారు. 


Read more