భవానీ మాలల విరమణపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-10-04T02:19:57+05:30 IST

భవానీ మాలల విరమణపై హైకోర్టులో విచారణ

భవానీ మాలల విరమణపై హైకోర్టులో విచారణ

అమరావతి: భవానీ మాలల విరమణపై హైకోర్టులో విచారణ జరిగింది. 2 రోజుల్లో హోమగుండం ఏర్పాటు చేయలేమని ప్రభుత్వ లాయర్ పేర్కొన్నారు. గతంలో కూడా తాము ఏర్పాటు చేయలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గతంలో ప్రభుత్వం హోమగుండం ఏర్పాటు చేసిందంటూ.. గురు భవానీల తరపు లాయర్ ఫొటోలను హైకోర్టుకు సమర్పించారు. ఈ విషయంపై ప్రభుత్వ లాయర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే ఏడాది హోమగుండం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ లాయర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Read more