ప్రభుత్వ టీచర్లకు అటెండెన్స్ గండం

ABN , First Publish Date - 2022-08-15T21:56:01+05:30 IST

ప్రభుత్వ టీచర్లకు అటెండెన్స్ గండం

ప్రభుత్వ టీచర్లకు అటెండెన్స్ గండం

అమరావతి: ప్రభుత్వ టీచర్లకు అటెండెన్స్ గండం ఎదరుకానుంది. స్కూల్‌కు నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొంది. రేపటి నుంచి ముఖ హాజరు అమల్లోకి వస్తుందని ఏపీ సర్కార్‌ తెలిపింది. సిమ్స్-ఏపీ యాప్‌ను టీచర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. స్కూల్‌కు వచ్చిన వెంటనే యాప్‌లో లాగిన్ అవ్వాలని సర్కార్‌ పేర్కొంది. ఉదయం 9 గంటల లోపు ఫొటో తీసి..వెంటనే అప్‌లోడ్‌ చేస్తేనే హాజరు అన్నారు. అలాగే బోధనేతర సిబ్బందికీ ఇదే విధానం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇంటర్‌నెట్‌ లేని చోట పరిస్థితి ఎలా అంటూ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయొద్దంటూ ఫ్యాప్టో పిలుపునిచ్చింది. 

Updated Date - 2022-08-15T21:56:01+05:30 IST