AP News: సీఆర్డీయే వుందా? లేదా? చెప్పండి: దొండపాడు గ్రామస్తులు

ABN , First Publish Date - 2022-09-13T17:42:32+05:30 IST

అమరావతి (Amaravathi): దొండపాడులో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది.

AP News: సీఆర్డీయే వుందా? లేదా? చెప్పండి: దొండపాడు గ్రామస్తులు

అమరావతి (Amaravathi): దొండపాడులో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. అధికారులను గ్రామస్తులు నిలదీశారు. తాము సీఆర్డీయే (CRDA)కు భూములు ఇచ్చామని, ఇప్పుడు అమరావతి మున్సిపాలిటీ అంటున్నారు.. సీఆర్డీయే ఉందా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. పూలింగ్ ఇవ్వని గ్రామాలను కలిపి మున్సిపాలిటీ అని మాలో మాకు గొడవలు పెడతారా? అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతే రాజధాని అని గత ప్రభుత్వం చెప్పిందని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మున్సిపాలిటీ అంటున్నారు.. భవిష్యత్తులో పంచాయతీ అనే అవకాశం లేదా? అని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు జరపాలని, కార్పొరేషన్ ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించినందున ఇప్పుడు మున్సిపాలిటీ ఆని ప్రభుత్వం ముందుకు వచ్చిందని అధికారులు అన్నారు. సాధారణంగా ఏవైనా గ్రామాలు పరిశ్రమలు ఉండి ఉంటే ఆయా గ్రామాలు తీర్మానం చేసి మున్సిపాలిటీ కావాలంటారన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వమే రివర్స్‌లో మీ గ్రామాల అభివృద్ధికి  మున్సిపాలిటీ రూపంలో ప్రతిపాదించిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మూడు రాజదానులు పెడతామన్నప్పుడు గ్రామ సభలు ఎందుకు పెట్టలేదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. కాగా మున్సిపాలిటీ ఏర్పాటుకు తాము వ్యతిరేకిస్తున్నట్లు దొండపాడు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

Read more