తహసీల్దార్‌ను చూసి దుండగుల పరార్

ABN , First Publish Date - 2022-09-17T22:43:21+05:30 IST

తహసీల్దార్‌ను చూసి దుండగుల పరార్

తహసీల్దార్‌ను చూసి దుండగుల పరార్

అన్నమయ్య: జిల్లాలోని మదనపల్లిలో అమ్మచెరువు మిట్ట దగ్గర మట్టి తవ్వకాలు బయటపడ్డాయి. అమ్మచెరువు మిట్ట దగ్గర 20 ట్రాక్టర్లు, జేసీబీతో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ మట్టి తవ్వకాల వెనుక వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. రూ.కోటి విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి కబ్జాకు యత్నించినట్లు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నతహసీల్దార్ చేరుకోవడంతో జేసీబీ వదిలి పరారైయ్యారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Read more