-
-
Home » Andhra Pradesh » ap news anantapuram-MRGS-AndhraPradesh
-
కార్పొరేట్ కళాశాల ఫీజుల వేధింపులకు విద్యార్థి బలి
ABN , First Publish Date - 2022-04-24T22:29:51+05:30 IST
కార్పొరేట్ కళాశాల ఫీజుల వేధింపులకు విద్యార్థి బలి

అనంతపురం: కార్పొరేట్ కళాశాల ఫీజుల వేధింపులకు విద్యార్థి బలయ్యాడు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి జనార్దన్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సత్యసాయి జూనియర్ కాలేజీలో జనార్దన్ ఇంటర్ చదువుతున్నాడు. ఫీజుల కోసం యాజమాన్యం వేధింపుల వల్లేనంటూ బంధువుల ఆరోపిస్తున్నారు. రూరల్ పీఎస్ ఎదుట విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.