ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి: లోకేష్

ABN , First Publish Date - 2022-08-18T00:39:49+05:30 IST

ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి: లోకేష్

ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి: లోకేష్

అమరావతి: జగన్‌ వైరస్‌కు భయపడి పరిశ్రమలు పారిపోతున్నాయని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. టీడీపీ ఐదేళ్ల పాలనలో 39,450 పరిశ్రమలు వచ్చాయన్నారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు భయపడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ పాలనలో ఆక్వా, పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు కూడా కష్టాలు పడుతున్నారని చెప్పారు. చెత్తపై పన్ను వేసినందుకు మహిళలు తిట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 

Read more