రేషన్ సరుకుల పంపిణీపై Ap High courtలో విచారణ

ABN , First Publish Date - 2022-07-19T04:07:49+05:30 IST

రేషన్‌ సరుకుల పంపిణీపై ఏపీ హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూటిప్రశ్నలు వేసింది. పక్కనే ..

రేషన్ సరుకుల పంపిణీపై Ap High courtలో విచారణ

అమరావతి: రేషన్‌ సరుకుల పంపిణీపై ఏపీ హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూటిప్రశ్నలు వేసింది. పక్కనే రేషన్ షాపు ఉన్నా ఇంటికి సరుకులు తెచ్చి ఇస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పనులు మానుకుని పేదలు సరుకుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని.. రేషన్‌షాప్‌ (Ration Shop)కు వెళ్లి సరుకులు తెచ్చుకోలేని స్థితిలో పేదలు లేరని వ్యాఖ్యానించింది. సరుకుల పంపిణీ పేరుతో అదనంగా ఖర్చు చేస్తున్నారని.. ఆ డబ్బుతో పేదలకు మరిన్ని సరుకులు ఇవ్వొచ్చని హైకోర్టు సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. 

Read more