పోలవరం పూర్తికి రూ.31,188 కోట్లు అవసరం: జగన్

ABN , First Publish Date - 2022-04-06T02:53:41+05:30 IST

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 31 వేల 188 కోట్లు అవసరమని ఏపీ సీఎం జగన్ కేంద్రప్రభుత్వం తీసుకెళ్లారు. ఢిల్లీ వెళ్లిన ఆయన ..

పోలవరం పూర్తికి రూ.31,188 కోట్లు అవసరం: జగన్

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 31 వేల 188 కోట్లు అవసరమని కేంద్రప్రభుత్వం దృష్టికి ఏపీ సీఎం జగన్ తీసుకెళ్లారు. ఢిల్లీ వెళ్లిన ఆయన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. ఏపీకి సంబంధించిన అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ ఆహార భద్రత చట్టం విధానం వల్ల ఏపీకి నష్టం జరుగుతోందని వివరించారు. ఏపీ తలపెట్టిన 12 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. జిల్లాల విభజన, రాష్ట్రాభివృద్ధిపైనా ప్రధాని, కేంద్రమంత్రులతో జగన్ చర్చించారు. 

Read more