ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన

ABN , First Publish Date - 2022-03-16T15:02:26+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చకు టీడీపీ సభ్యుల పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం దగ్గర నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై జ్యుడీషియల్‌ విచారణకు టీడీపీ పట్టుపడుతోంది. అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన చేపట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. 

Read more