AP Assembly Approved: ఎన్టీఆర్ వర్సిటీ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ABN , First Publish Date - 2022-09-21T18:27:52+05:30 IST

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

AP Assembly Approved: ఎన్టీఆర్ వర్సిటీ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

అమరావతి: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health university) పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ హెల్త్ వర్సిటీ (YSR Health university)గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం మంత్రి రజనీ (Minister rajani) ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. మంత్రి (AP Minister) సభలో మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్నవారికి ఎన్టీఆర్ (NTR) పేరు గుర్తోస్తోందని, అధికారం ఉంటే ఓ లాగా అధికారం లేకపోతే మరోలా చెపుతారని అన్నారు. ఎన్టీఆర్ మీద జగన్‌ (Jagan mohan reddy)కు గౌరవం ఉందని స్పష్టం చేశారు. 8 మెడికల్ కాలేజీలను వైఎస్సార్ 11కు  చేశారని...దానిని జగన్ 28 మెడికల్ కాలేజీలకు చేర్చారని చెప్పుకొచ్చారు. అందుకే ఆ క్రెడిట్ మనం తీసుకోవాలనే .. వైఎస్ఆర్ పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి వంద యూనివర్సిటీలకు అయినా వైఎస్ఆర్ (YSR) పేరు పెట్టాలని మంత్రి రజని అన్నారు. 

Read more