ఆఖరికి రికార్డింగ్ డ్యాన్స్‌లతో.. ప్రజలను కూర్చోబెట్టే స్థాయికి దిగజారారు: అనిత

ABN , First Publish Date - 2022-05-30T18:20:56+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఆఖరికి రికార్డింగ్ డ్యాన్స్‌లతో.. ప్రజలను కూర్చోబెట్టే స్థాయికి దిగజారారు: అనిత

అమరావతి : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తిప్పికొడితే మూడేళ్లు కాలేదు.. అప్పుడే ప్రజలు రావట్లేదని ఎద్దేవా చేశారు. ఆఖరికి రికార్డింగ్ డ్యాన్స్‌లు చూపించి.. ప్రజలను కూర్చోబెట్టే స్థాయికి దిగజారిపోయారన్నారు. మూడేళ్ల పాలన సుపరిపాలన అయితే.. మీకు ఈ ఖర్మ ఎందుకు పడుతుందని ట్వీట్‌లో అనిత ప్రశ్నించారు.


Read more