మహిళల రక్షణలో విఫలమైన సీఎం జగన్‌కి నోటీసు ఇవ్వగలరా?

ABN , First Publish Date - 2022-04-24T10:00:08+05:30 IST

జయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారానికి గురై, అక్కడే చికిత్స పొందుతున్న మానసిక దివ్యాంగురాలిని పరామర్శించేందుకు..

మహిళల రక్షణలో విఫలమైన సీఎం జగన్‌కి నోటీసు ఇవ్వగలరా?

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు అనిత సవాల్‌


విశాఖపట్నం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారానికి గురై, అక్కడే చికిత్స పొందుతున్న మానసిక దివ్యాంగురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ సీఎం చంద్రబాబుకు మహిళా కమిషన్‌ నోటీస్‌ ఇవ్వడంపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. శనివారం పార్టీ కార్యాలయంలో  మాట్లాడారు. కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు దమ్ముంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఇవ్వడంలో విఫలమైన సీఎం జగన్‌రెడ్డికి నోటీస్‌ ఇవ్వాలని సవాల్‌ చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా కాకుండా వైసీపీ కార్యకర్తగా పద్మ వ్యవహరించారని ఆరోపించారు. ఆస్పత్రిలో చంద్రబాబుతో వాగ్వాదానికి దిగాల్సిందిగా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌ ఇచ్చారన్నారు. అత్యాచార ఘటనల్లో ఏపీ రెండో స్థానంలో వుందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డులు చెబుతున్నాయన్నారు.  

Updated Date - 2022-04-24T10:00:08+05:30 IST