అంగన్‌వాడీ ఆయాపై అత్యాచార యత్నం

ABN , First Publish Date - 2022-09-08T09:44:58+05:30 IST

అంగన్‌వాడీ ఆయాపై అత్యాచార యత్నం

అంగన్‌వాడీ ఆయాపై అత్యాచార యత్నం

పీకే సర్వే బృందానికి చెందిన వ్యక్తని అనుమానం 

వెలిగండ్ల, సెప్టెంబరు 7: రాజకీయ సర్వే పేరుతో అంగన్‌వాడీ ఆయాపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలోని రాళ్లపల్లిలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సర్వే కోసమంటూ బుధవారం రాళ్లపల్లి వచ్చిన ఓ యవతి, యువకుడు సచివాలయంలోకి వెళ్లి సిబ్బంది ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం వారిలో ఒకరైన అమీర్‌బాషా పక్కనే ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఆయా ఒంటరిగా ఉండడం గమనించి సెంటర్‌కు సంబంధించిన వివరాలు చెప్పాలని అడిగాడు. ఆయా వివరాలు చెప్తుండగా ఆమెను ఫొటోలు తీస్తూ ‘నీకు జీతమెంత.. చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నావు, నేను ఆఫీసర్‌ను.. నీకు మరింత జీతం వచ్చేలా చేస్తాను..’ అని చెప్పి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ వ్యక్తి తాను అధికారినని, సర్వే కోసం వచ్చానని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. సర్వే నిమిత్తం ఆయనతోపాటు వచ్చిన యువతిని గ్రామస్థులు నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను విచారించి వదిలిపెట్టారు. బాధితురాలు ఆయా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ప్రైవేటు సర్వే ఏజెన్సీలు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నాయి. ఇదిలా ఉండగా పట్టుబడిన మహిళ తొలుత తాము సామాజిక సర్వే కోసం వచ్చామని తెలిపింది. గట్టిగా నిలదీయడంతో పీకే బృందం నుంచి వచ్చామని వెల్లడించిందని గ్రామస్థులు చెప్పారు. దీంతో లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే టీమ్‌ సభ్యుడిగా అనుమానిస్తున్నారు.

Read more