ఏపీ నూతన మంత్రి వర్గం ఇదే!...

ABN , First Publish Date - 2022-04-10T17:36:37+05:30 IST

అమరావతి: ఏపీ నూతన మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది.

ఏపీ నూతన మంత్రి వర్గం ఇదే!...

అమరావతి: ఏపీ నూతన మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రివర్గంలోకి 10 మంది పాత వారికి చోటు కల్పిస్తూ 15 మంది కొత్తవారు రాబోతున్నారు. 


ఏపీ మంత్రుల తుది జాబితా ఇదే...

విజయనగరం జిల్లా: బొత్స, రాజన్నదొర

శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు

విశాఖ జిల్లా: భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్

తూ.గో జిల్లా: దాడిశెట్టి రాజా, చిట్టి బాబు, వేణుగోపాల కృష్ణ 

ప.గో: జిల్లా: కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్

కృష్ణా జిల్లా: జోగి రమేష్, కొడాలి నాని, రక్షణనిధి

గుంటూరు జిల్లా: విడదల రజనీ, మేరుగ నాగార్జున

ప్రకాశం జిల్లా: ఆదిమూలపు సురేష్

నెల్లూరు జిల్లా: కాకాణి గోవర్దన్ రెడ్డి

చిత్తూరు జిల్లా: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కడప జిల్లా: అంజాద్ బాషా, కొరుముట్ల శ్రీనివాస్

కర్నూలు జిల్లా: శిల్పా చక్రపాణి రెడ్డి, గుమ్మనూరు జయరాం

అనంతపురం జిల్లా: జొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారాయణ


ఆదివారం మధ్యాహ్నానికి 25 మంది నూతన మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం. అనంతరం అందుబాటులో ఉండాలంటూ సీఎంవో నుంచి ఆ 25 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళతాయి. ఆఖరి నిముషంలో అయిన తమ అవకాశాలను నిలుపుకోవడానికి ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాగా ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారయ్యింది. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Read more