సీనియర్‌ల ఒత్తిడికి దిగొచ్చిన సీఎం జగన్

ABN , First Publish Date - 2022-04-10T16:58:03+05:30 IST

అమరావతి: ఏపీ నూతన మంత్రివర్గం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది.

సీనియర్‌ల ఒత్తిడికి దిగొచ్చిన సీఎం జగన్

అమరావతి: ఏపీ నూతన మంత్రివర్గం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా కొత్త మంత్రి వర్గ కసరత్తుపై సీఎం జగన్ సుదీర్ఘ సమయం వెచ్చించారు. గవర్నర్ ఆమోదానికి ఇప్పటికే రాజీనామా లేఖలు పంపించారు. సీనియర్‌ల ఒత్తిడికి దిగివచ్చిన ముఖ్యమంత్రి 8 నుంచి 10 మంది పాత వారికి కాబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు సమాచారం. సీఎం మారిన వైఖరిపై పార్టీలో చర్చ జరుగుతోంది. సీనియర్‌లను తొలగించడం సీఎంకు అంత ఈజీ కాదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీనియర్‌ల పేర్లు జాబితాలో పెరగడంతో 4 నుంచి ఐదుగురి ఆశావహులు నిరాశ  చెందుతున్నట్లు తెలియవచ్చింది. ఆదివారం మధ్యాహ్నానికి 25 మంది నూతన మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం. అనంతరం అందుబాటులో ఉండాలంటూ సీఎంవో నుంచి ఆ 25 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళతాయి. ఆఖరి నిముషంలో అయిన తమ అవకాశాలను నిలుపుకోవడానికి ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాగా ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారయ్యింది. సోమవారం ఉదయం 11:31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Read more