-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh Three Capitals Government Supreme Court Vsp-MRGS-AndhraPradesh
-
Ap Capital: ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకు వెళ్లడం వెనుక మర్మమేంటి?
ABN , First Publish Date - 2022-09-18T01:54:18+05:30 IST
3 రాజధానులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును....

అమరావతి: 3 రాజధానుల (Three Capitals)పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పును.. సుప్రీంకోర్టు (Supreme Court)లో ఏపీ సర్కార్ (AP Government) సవాల్ చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీ (Assembly)కి లేదని హైకోర్టు తీర్పును వెలువరించింది. అలా చేయడమంటే శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.
సీఆర్డీఏ(CRDA) చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ.. హైకోర్టు సూచించడం అసెంబ్లీ(Assembly) అధికారాలను ప్రశ్నించడమేనని సర్కార్ పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులని పిటిషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ తెలిపింది. కాగా.. మూడు రాజధానుల బిల్లు (3 Capitals Bill)ను వెనక్కి తీసుకుంటున్నట్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘‘రాజధాని పూర్తి చేయమని హైకోర్టు చెప్పాక ఆరు నెలలు ఏం చేశారు?. మరో బిల్లు పెట్టేస్తామంటూ బీరాలు పలికి మళ్లీ కోర్టుకే వెళ్లారెందుకో?. శాసనసభ అధికారాలపై హైకోర్టుతో సుప్రీం ఏకీభవిస్తే అప్పుడేం చేస్తారు?. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకు వెళ్లడం వెనుక మర్మమేంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.