AP News: మరో రూ. 2వేల కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-10-03T21:50:21+05:30 IST

జగన్ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మరో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది.

AP News: మరో రూ. 2వేల కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి (Amaravathi): జగన్ ప్రభుత్వం (Jagan Govt.) సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మరో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్‌ బాండ్ల వేలానికి రేపు (మంగళవారం) సెలవు దినం కావడంతో, సోమవారమే వేలం జరిగింది. వెయ్యి కోట్ల రూపాయలు 13 సంవత్సరాలకు 7.82 శాతం వడ్డీతో అప్పు తీసుకుంది. మరో వెయ్యి కోట్ల రూపాయలు 20 సంవత్సరాలకు 7.74 శాతం వడ్డీతో బాండ్ల ద్వారా రుణం తీసుకుంది. ఈ ఆరు నెలల్లో ఏపీ ప్రభుత్వం తెచ్చిన అప్పు 51 వేల 608 కోట్ల రూపాయలు. కాగా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి మించి అప్పు తెస్తున్నారని ఆర్ధిక నిపుణుడు జీవి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఆర్ధిక క్రమశిక్షణ ఉల్లంఘనేనని ఆయన అన్నారు.

Updated Date - 2022-10-03T21:50:21+05:30 IST