బీసీల పట్ల చిత్తశుద్ధి లేని వైసీపీ: సవిత

ABN , First Publish Date - 2022-09-25T05:09:21+05:30 IST

బీసీల పట్ల చిత్తశుద్ధి లేని సీఎం జగనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమర్శించే హక్కు లేదని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ క కార్యదర్శి సవిత విమర్శించారు.

బీసీల పట్ల చిత్తశుద్ధి లేని వైసీపీ: సవిత
విలేకరులతో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత

పెనుకొండ, సెప్టెంబరు 24: బీసీల పట్ల చిత్తశుద్ధి లేని సీఎం జగనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమర్శించే హక్కు లేదని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ క కార్యదర్శి సవిత విమర్శించారు. శనివారం స్థానికంగా ఆమె విలేకరులతో మాట్లా డారు. ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో... కుప్పం అసెంబ్లీ స్థానాన్ని బీసీలకు ఇవ్వలేదని, బీసీలపట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదన్న వ్యాఖ్యలను ఖండించారు. బడుగు బలహీనవర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గుర్తించింది టీడీపీయేనన్నారు. చట్టసభల్లో  మొదటిసారిగా బీసీలకు రిజర్వేషన కల్పించామన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నది కూడా టీడీపీయేనన్నారు. జగనరెడ్డికి బీసీలపట్ల చిత్తశుద్ధి ఉంటే పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంట్‌ స్థానాలను బీసీలకు ఇచ్చి గెలిపించాలని సవాల్‌ విసిరారు. రాయలసీమలోనే 43 జనరల్‌ సీట్లలో 33కి పైగా ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టిన జగనకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఐదుగురు రెడ్లకు రాసిచ్చిన సీఎంకు... చంద్రబాబుపై మాట్లాడే హక్కు లేదన్నారు. చంద్రబాబును ఎవరూ ఓడించలేరని, ఆయనపై కుప్పం ప్రజలపై అపార న మ్మకం ఉందన్నారు. రాబోవు ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు తెలుగుదేశంపార్టీని ప్ర జలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారన్నారు. సమావేశంలో గుట్టూరు మాజీ సర్పంచ సూర్యనారాయణ, అడదాకులపల్లి మాజీ సర్పంచ ఈశ్వర్‌ ప్రసాద్‌, తెలుగు యువత నాయకుడు త్రివేంద్రనాయుడు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-25T05:09:21+05:30 IST