వైసీపీని చిత్తుగా ఓడించాలి: గుండుమల

ABN , First Publish Date - 2022-12-13T23:56:42+05:30 IST

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పి, చిత్తుగా ఓడించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు.

వైసీపీని చిత్తుగా ఓడించాలి: గుండుమల

గుడిబండ, డిసెంబరు 13: సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పి, చిత్తుగా ఓడించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు. మండలంలోని బాలేపల్లిలో మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి’ నిరసన చేపట్టారు. ఈసందర్భంగా పోస్టర్లు ప్రదర్శించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం గుండుమల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి అధికారంలోకి వచ్చి పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, వి ద్యుతచార్జిలు పెంచి ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టాడని విమర్శించారు. వైసీపీ ప్ర భుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఇసుక దొరక్క పేద ప్రజలు ఇళ్లు నిర్మించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టీ డీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్‌ మద్దనకుంటప్ప, నాయకులు మల్లికార్జున, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మంజునాథ్‌, రాజు, సర్పంచు నారాయణప్ప, నాగరాజు, కన్నా, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:56:42+05:30 IST

Read more