పాలనలో వైసీపీ విఫలం

ABN , First Publish Date - 2022-01-03T05:47:10+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తి అయినా అన్నింటా విఫలమైందని, ముఖ్యంగా నిత్యావసర వ స్తువులపై ధరలను బాదుతూ బాదుడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జ గన తయారయ్యారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

పాలనలో వైసీపీ విఫలం
గౌరవసభలో మాట్లాడుతున్న పరిటాలసునీత


- ఆకాశాన్ని అంటుతున్న ధరలు

- గ్రామాల్లో చిచ్చురేపుతున్న నాయకులు

- గౌరవసభలో మాజీమంత్రి పరిటాల సునీత

రామగిరి, జనవరి 2: వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తి అయినా అన్నింటా విఫలమైందని, ముఖ్యంగా నిత్యావసర వ స్తువులపై ధరలను బాదుతూ బాదుడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జ గన తయారయ్యారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని గంతిమర్రి, కుంటిమద్ది పంచాయతీ కేంద్రాలలో ఆ దివారం గౌరవసభ - ప్రజా సమస్యల చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... అసెంబ్లీలో ఎమ్మెల్యే, మం త్రులు ఓ మహిళను కించపరచేలా మాట్లాడుతుంటే వెకిలినవ్వులు నవుతున్న సీఎంజగనకు భార్య, పిల్లలు లేరా అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు జరిగిన అన్యాయమన్నారు. రైతు ప్రభు త్వమని చెప్పుకుంటున్న పాలకులు రైతులకు చేసిందేమిటో చెప్పా లన్నారు. గ్రామాలలో ప్రజలకు మనశ్శాంతి లేకుండా చిచ్చులు రే పుతూ... సచివాలయాల పేరుతో 40 ఏళ్లగా అనుభవంలో ఉన్న భూ ములను తీసుకుని వాటి భవనాలను నిర్మించారన్నారు. అమ్మఒడి పేరుతో చెప్పింది ఒకటి... చేసిందొకటన్నారు. టీడీపీ హయాంలో రై తులకు ఇనపుట్‌ సబ్సిడీ, 90శాతం సబ్సిడీతో వ్యవసాయ పరిక రాలను అందించామన్నారు. కుంటిమద్దిలో చెరువులకు నీళ్లిచ్చి పై లానను ఏర్పా టుచేస్తే దాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అన్నారు. వైసీపీ నాయకులకు చేతనైతే టీడీపీ కన్నా మరింత అ భివృద్ధి చేసి మరో పైలానను ఏర్పాటుచేసుకోవచ్చన్నారు. కొందరు పోలీసులు ఏకపక్షంగా.... అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. వైఎస్‌జగన డబ్బు వ సూళ్ల కోసం ఓటీఎస్‌ పేరుతో ప్రజలపై భారం మోపడం దారుణ మన్నారు.

ఓటీఎస్‌కి ఎవరూ డబ్బులు చెల్లించవద్దని, టీడీపీ అధికా రంలోకి వస్తే ఇళ్ల ఉచితంగా రిజిసే్ట్రషన చేస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీపీలు రంగయ్య, పరందామయాదవ్‌, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, కన్వీనర్‌ సుబ్బరాయుడు, నాయకు లు మారుతీప్రసాద్‌, మహిళానాయకురాళ్లు వెంకటసుబ్బమ్మ, సుకన్య, స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

బుక్కరాయసముద్రం: రాష్ట్ర శాసనసభను సీఎం జగన కౌరవ సభలా మా ర్చేశారని , తిరిగి గౌవరసభగా మారాలంటే జగన దిగి పోవాల్సిందేనని టీడీపీ శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెన్నంపల్లిలో ఆదివారం గౌరవసభ - ప్రజా సమస్యల చర్చావేదిక నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా ద్విసభ్య కమిటీ స భ్యులతో పాటు మాజీ జడ్పీటీసీ రామ లింగారెడ్డి, మండల కన్వీనర్‌ అశోక్‌  హాజరై మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం  పూర్తిగా వెన కబడిందన్నారు. జగన పూర్తి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా రన్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలను వైసీపీ నేతలు, కార్యకర్తలకే ఇచ్చి, మరో వైపు సామాన్యులపై పన్నుల భారం రెట్టింపు చే స్తున్నా రని విమర్శించారు. ప్రజలు త్వరలోనే వైసీపీకి తగిన గుణ పాఠం చెబుతారన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాలను వివరించి, కరపత్రాలను పంపిణీ చేశారు. టీ డీపీ నాయకులు  కేశన్న, పొడరాళ్ల రవీంర్ర, మల్లిఖార్జునరెడ్డి, స ర్పంచ మల్లి, లక్ష్మీనారాయణ, శ్రీకాంతరెడ్డి, గుర్రప్ప, మాజీ ఎంపీ టీసీ నారాయణస్వామి, నరసప్ప, కుళ్లాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-03T05:47:10+05:30 IST