వైసీపీ.. ప్రజావ్యతిరేక విధానాలను ఇకనైనా వీడాలి

ABN , First Publish Date - 2022-10-03T05:57:33+05:30 IST

గ్రామపంచాయతీల నుంచి తీసుకున్న నిధులను వెంటనే తిరిగి ఆయా పంచాయతీలకు జమచేయాలని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి డిమాండు చేశారు.

వైసీపీ.. ప్రజావ్యతిరేక విధానాలను ఇకనైనా వీడాలి
పుట్టపర్తిలో గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి


పుట్టపర్తి, అక్టోబరు 2:  గ్రామపంచాయతీల నుంచి తీసుకున్న నిధులను వెంటనే తిరిగి ఆయా పంచాయతీలకు జమచేయాలని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి డిమాండు చేశారు. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మహాత్మగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గ్రామపంచాయతీల పట్ల ప్రభుత్వ తీరుపై వినతిపత్రం అందచేసి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం గ్రా మపంచాయతీ నిధులను వాడుకొని గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.  సర్పంచులు శ్రీనివాసులు, ప్రవీణ్‌, పెద్దన్న, ఓబుళేసు, నాయకులు సామకోటి ఆదినారాయణ, బెస్తచలపతి, శ్రీరామిరెడి,్డ సాల క్కగారి శ్రీనివాసులు, విజయ్‌కుమార్‌, ఓలిపిశ్రీనివాసులు, రామకృష్ణ, మల్లిరెడ్డి, మైలేశంకర్‌, మైనారిటీ నాయకులుమహమ్మద్‌ రపీ, తదితరులు పాల్గొన్నారు.

ధర్మవరంరూరల్‌: ఎప్పటికైనా అంతిమవిజయం ఆహింసదే అని మహాత్మా గాంధీ చూపిన మార్గంలో పయనించాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా విచ్చేసిన పరిటాలశ్రీరామ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే గాంధీకలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచేవిధంగా గ్రామపంచాయితీ నిధులను ఇతర అవసరాలకు మళ్లించిం దంటూ.... సర్పంచలు, టీడీపీ నాయకులు కలిసి అంతకు ముం దు పట్టణంలోని గాంధీ విగ్రహా నికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు.  నాయకులు కమతంకాటమయ్య, మహేష్‌ చౌదరి, పోతుకుంట లక్ష్మన్న, ముత్యాలప్పనాయుడు, మేకల రామాంజనేయులు, పురుషోత్తం గౌడ్‌, ఫణికుమార్‌, అంబటిసనత, నాగుర్‌హుస్సేన, విజయసారథి, పరిసేసుధాకర్‌, చిన్నూరు విజయ్‌చౌదరి, జంగం నరసింహులు, రాంపురంశీన, అనిల్‌గౌడ్‌, పోతు కుంట రమేష్‌, చిట్రారామ్మోహన, ముచ్చురామిక్రిష్ట, గరుడంపల్లి చంద్రశేఖర్‌, చండ్రా యుడు, బడన్నపల్లిక్రిష్ట, శ్రీనివాసులు, మల్లేనిపల్లిచంద్ర, జమీర్‌, దేవరకొండ రామకృష్ణ, చింతపులుసు పెద్దన్న, భీమినేని ప్రసాద్‌నాయుడు, రాళ్లపల్లిషరీఫ్‌,  అమరసుధాకర్‌, తొగటఅనిల్‌, అశోక్‌, బొంత చిరంజీవి,  బిల్వంపల్లిబాబు,  కుళ్లాయప్ప, కరెంట్‌ ఆది, రేనాటిశీనా, పల్లపురవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. 

్లకదిరి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధనాలను ఇంకైనా విడనాడేలా చూసి, గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో అమలు అయ్యేలా చూడాలని ఆదివారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మహాత్మగాంధీ 153వ .జయంతి సందర్భంగా కదిరిపట్టణంలోని రాణీపేట పాఠశాలలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫర్వీనభాను, డైమండ్‌ ఇర్షాన, ఉమాదేవి, పీట్ల రమణమ్మ, ప్రేమలత, గంగరత్నమ్మ,  కార్యకర్తలు పాల్గొన్నారు. 

్లతనకల్లు : గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని టీడీపీ నాయకులు విమర్శించారు. మండలకేంద్రంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో గాంధీజయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతోకూడిన వినతిపత్రాన్ని గాంధీ చిత్రపటానికి అందించారు. టీడీపీ నాయకులు రెడ్డి శేఖర్‌రెడ్డి, బీగం శంకర్‌ నా యుడు,  మల్లికార్జున, మహబూబ్‌బాషా, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. 


Read more