కూతురిపై దిగులుతో..!

ABN , First Publish Date - 2022-09-27T05:08:02+05:30 IST

గుంతకల్లు పట్టణంలోని బ్యాంకు కాలనీకి చెందిన వ్యాపారి జేవీ రమణ (60) సోమవారం ఉరివేసుకున్నాడు.

కూతురిపై దిగులుతో..!
రమణ (ఫైల్‌)

గుంతకల్లు: గుంతకల్లు పట్టణంలోని బ్యాంకు కాలనీకి చెందిన వ్యాపారి జేవీ రమణ (60) సోమవారం ఉరివేసుకున్నాడు. టూటౌన పోలీసులు తెలిపిన మేరకు, పట్టణంలోని ఎస్‌ఎల్‌వీ టాకీస్‌ వద్ద మోడ్రన ఫర్నిచర్‌ షాప్‌ను నిర్వహిస్తున్న ఆయన.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేశాడు. పెద్ద కూతురు కెనాడాలో, చిన్న కూతురు ధర్మవరంలో ఉంటున్నారు. మూడు సంవత్సరాలైనా పెద్ద కూతురు తనను చూసేందుకు రాలేదని మనోవేదన చెందేవాడు. కష్టపడి పెంచి, పెళ్లిళ్ల్లు చేస్తే.. చివరకు తన గురించి పట్టించుకోవడం లేదని సన్నిహితుల వద్ద బాధపడేవాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 8-30 గంటల సమయంలో షాప్‌ వద్దకు వెళుతున్నానని తన భార్య మహాలక్ష్మి చెప్పి బయటకు వెళ్లాడు. కానీ షాప్‌ వద్దకు వెళ్లకుండా, మిల్లు కాలనీలోని తమ సొంత ఇంటికి వెళ్లి.. పై గదిలో కొక్కేనికి తాడుతో ఉరి వేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్‌ లెటర్‌ రాసిపెట్టా డు. రాత్రి ఆయన ఇంటికి రాకపోవడంతో భార్య, బంధువులు గాలించారు. అనుమానం వచ్చి, మిల్లుకాలనీలోని ఇంటికి వెళ్లి చూసి, ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ చిన్న గోవిందు తెలిపారు.          


Read more