వీఆర్వోలపై పని ఒత్తిడి తగదు

ABN , First Publish Date - 2022-12-12T23:50:56+05:30 IST

వీఆర్వోలపై (విలేజ్‌ రె వెన్యూ ఆఫీసర్‌) పని ఒత్తిడి తగ్గించాలని వీఆర్వోల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం గోరంట్ల, సోమందేపల్లిలో త హసీల్దార్‌ కార్యాలయాల ఎదుట వీఆర్వోలు నిరసన తెలియజేశారు.

వీఆర్వోలపై పని ఒత్తిడి తగదు

తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన

గోరంట్ల/సోమందేపల్లి, డిసెంబరు 12: వీఆర్వోలపై (విలేజ్‌ రె వెన్యూ ఆఫీసర్‌) పని ఒత్తిడి తగ్గించాలని వీఆర్వోల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం గోరంట్ల, సోమందేపల్లిలో త హసీల్దార్‌ కార్యాలయాల ఎదుట వీఆర్వోలు నిరసన తెలియజేశారు. అనంతరం ఆయా తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ పని ఒత్తిడితో చనిపోయిన వీ ఆర్‌ఓ కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల ఆర్థిక సాయం, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. చాలామంది చనిపోయిన వీ ఆర్‌ఓల కుటుంబాలకు మట్టి ఖర్చులు ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. వా రికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వెంటనే కల్పించాలని డిమాండ్‌ చేశారు. భూముల రీసర్వే పేరుతో వీఆర్‌ఓలతో ఖర్చు పెట్టించిన మొత్తాన్ని వెంటనే ఇవ్వాలన్నారు. సెలవు, పండుగ రోజుల్లో వీఆర్‌ఓలకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. గ్రామ, వార్డు స చివాలయాల్లో 90 శాతంపైగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని, వీఆర్వోలకు ప్రత్యేకంగా కంప్యూటర్‌, ప్రింటర్‌, స్టేషనరీ అందించాలన్నారు. కార్యక్రమంలో గోరంట్ల మండల వీఆర్‌ఓల సంఘం నాయకులు మునెప్ప, రమేష్‌, పెద్దన్న, సల్మానఖాన, చంద్రకళ, అనిల్‌, మన్సూర్‌, అశోక్‌, గుడిబండలో అయూబ్‌, రాజశేఖర్‌, రామాంజనేయులు, అన్నపూర్ణ, అనిత పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:50:56+05:30 IST

Read more