మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-12T05:40:08+05:30 IST

పట్టణంలోని కోట వీధికి చెందిన కదిరమ్మ (29) అనే మహిళ శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

మహిళ ఆత్మహత్య

గుత్తి, జూన్‌ 11: పట్టణంలోని కోట వీధికి చెందిన కదిరమ్మ (29) అనే మహిళ శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు కదిరమ్మ భర్త శేఖర్‌ బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కదిరమ్మ కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతుండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి కదిరమ్మ ఇంట్లో ఉరి వేసుకుని వేళాడుతుండగా గుర్తిం చిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నారు.Read more