ఈ బైకు ఎవరిదో..?

ABN , First Publish Date - 2022-09-28T05:29:17+05:30 IST

మండలకేంద్రంలోని తిరుమలాపురం క్రాస్‌ వద్ద గుర్తుతెలియని ద్విచక్రవాహనం మూ డురోజుల నుంచి ఉందని పరిసర తోటల్లో పనిచేసేవారు తెలిపారు.

ఈ బైకు ఎవరిదో..?

 యల్లనూరు, సెప్టెంబరు 27: మండలకేంద్రంలోని తిరుమలాపురం క్రాస్‌ వద్ద గుర్తుతెలియని ద్విచక్రవాహనం మూ డురోజుల నుంచి ఉందని పరిసర తోటల్లో పనిచేసేవారు తెలిపారు. ఏపీ 04 బీపీ 3774 నెంబర్‌గల గ్లామర్‌ బైక్‌ ఉంది. శని వారం సాయంత్రం నుంచి ప్రధాన రహ దారి అయిన తాడిపత్రి- యల్లనూరు రోడ్డు పక్కనే నిలిపి ఉండడంతో ఎవరైనా దొం గిలించి ఇక్కడ వదిలేశారా లేక మరే దైనా కారణం ఉందా అన్న అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. రెండునెలల క్రితం కూడా ఇదే రహదారిపై యల్లనూ రు- జంగంపల్లి మధ్యన ద్విచక్రవాహనం ఉండడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Read more