గాలివాన వస్తే.. కరెంట్‌ కట్‌..!

ABN , First Publish Date - 2022-06-07T06:26:25+05:30 IST

మండలంలో చిన్నపాటిగా గాలీవాన వచ్చినా చాలు విద్యుత కష్టాలు మొదల వుతావు. ఇక మూడు రోజులైనా విద్యుత సరఫరా ఉండదు.

గాలివాన వస్తే.. కరెంట్‌ కట్‌..!
విడపనకల్లు విద్యుత సబ్‌ స్టేషన

    ఇక రోజుల తరబడి చీకట్లో మగ్గాల్సిందే 

    ప్రత్యామ్నాయమున్నా పట్టించుకోని అధికారులు 

    విడపనకల్లు సబ్‌స్టేషన దుస్థితి 


విడపనకల్లు, జూన 6 : మండలంలో చిన్నపాటిగా గాలీవాన వచ్చినా చాలు విద్యుత కష్టాలు మొదల వుతావు. ఇక  మూడు రోజులైనా విద్యుత సరఫరా ఉండదు. మండలంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా అప్పుడు ఆగిపోయిన విద్యుత సరఫరా ఆదివారం ఉదయం 11 గంటలకు సరఫరా అయింది. విడపనకల్లు సబ్‌స్టేషనకు గుంతకల్లు నుంచి 33/11 కేబీ విద్యుత సరఫరా అవుతుంది.  వాగులు, వంకలు, పంట పొలాల మీదుగా విద్యుత స్తంభాలను పాతి 35 కిలోమీటర్ల దూరం నుంచి విద్యుత సరఫరా చేస్తున్నారు. ఈదురు గాలులు వచ్చినప్పుడు విద్యుత సరఫరా ఆగిపోతే ఏ స్తంభం కూలిందో తెలుసుకునేందుకే రెండు రోజులు.. ఇక వాటి మరమ్మత్తుల కోసం మరో రోజు  సమయం తీసుకొంటున్నారు. దీంతో మండలంలోని ప్రభుత్వ కార్యాల యాలు, వ్యాపార సముదాయాల్లో పనులు జరక్క ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. మూడు గంటల్లో ప్రత్యామ్నాయంగా విద్యుత సరఫరా చేసే అవకాశమున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వజ్రకరూరు, ఉరవకొండ, బెళుగుప్ప, బొమ్మనహళ్‌ మండలాలకు విద్యుత సరఫరా ఆగిపోతే రెండు గంటల్లో ప్రత్యామ్నాయంగా విద్యుత సరఫరా చేస్తున్నారు. అలాగే విడపనకల్లు మండలానికి డబుల్‌ ఫీడింగ్‌ ఇంటర్‌ లింక్‌ ద్వారా రెండు, మూడు గంటల్లో విద్యుత సరఫరా చేయవచ్చు. ఉరవకొండలోని హంద్రీనీవా కాలువ వద్దనున్న సబ్‌స్టేషన నుంచి పాల్తూరు సబ్‌స్టేషనకు ఇంటర్‌ లింక్‌ విద్యుత లైన్లు ఉన్నాయి. వాటికి ఉండబండ నుంచి విడపనకల్లుకు ఓ ఆరు కిలో మీటర్ల దూరంలో విద్యుత లైన్లు ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుంది. ఈ విషయంపై మండల ప్రజలు ప్రజాప్రతినిధులు విన్నవించినా విద్యుత అధికారులు పట్టించుకోవడం లేదు.    


Updated Date - 2022-06-07T06:26:25+05:30 IST