అంతరిక్షంపై అవగాహన పెంచేందుకే వారోత్సవాలు

ABN , First Publish Date - 2022-10-07T05:17:31+05:30 IST

అంతరిక్ష సాంకేతికత, దాని ప్రయోజనాలను సామాన్య ప్రజలకు, విద్యార్థులకు తెలిపేందుకే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన పేర్కొన్నారు. పుట్టపర్తిలో అంతరిక్ష వారోత్సవాలను జరుపుకోవడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు.

అంతరిక్షంపై అవగాహన పెంచేందుకే వారోత్సవాలు
సత్యసాయి మహా సమాధిని దర్శించుకుంటున్న గవర్నర్‌

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన..  పుట్టపర్తిలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు-2022 ప్రారంభం

పుట్టపర్తి, అక్టోబరు 6: అంతరిక్ష సాంకేతికత, దాని ప్రయోజనాలను సామాన్య ప్రజలకు, విద్యార్థులకు తెలిపేందుకే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన పేర్కొన్నారు.  పుట్టపర్తిలో  అంతరిక్ష వారోత్సవాలను జరుపుకోవడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌లో  ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు-2022ను ఇస్రో డైరెక్టర్‌ రాజరాజనతో కలిసి బుధవారం ప్రారంభించారు. అంతరిక్ష శిథిలాలను పర్యవేక్షించడానికి ప్రాజెక్టు నేత్ర (ఎనఈటీఆర్‌ఏ)ను ఇస్రో ప్రారంభించిందని, ఆ ప్రాజెక్టును ఇక్కడ ప్రకటించడం తనకు ఎనలేని అనందం ఇచ్చిందని అన్నారు. దేశీయ నిఘా వ్యవస్థ శిఽథిలాల సమాచారాన్ని ఇది ప్రత్యక్షంగా ఇస్తుందని అన్నారు. అంతరిక్ష ఆస్తులను రక్షించడంలో తదుపరి ప్రణాళికకు కూడా ఉపయోగపడుతుందన్నారు. కక్ష్యలో సేవలందించడానికి ఇస్రో, స్పాడెక్స్‌ అనే డ్యాకింగ్‌  ప్రయోగాన్ని కూడా అభివృద్ధి చేస్తోందన్నారు. ఇది మిషన దీర్ఘాయివును నిర్ధారించడమే కాకుండా ప్రయోగాలను కలపడానికి భవిష్యత్తు ఎంపిక ను కూడా అందిస్తుందన్నారు. వనరుల వాంఛనీయ వినియోగాన్ని నిర్ధారించడానికి  అంతరిక్ష యాత్ర భద్రత ను ఉత్పాదకతను పెంచడానికి, అభివృద్ధి చెందుతున్న  ప్రైవేట్‌ రంగాన్ని స్థిరత్వ మార్గదర్శకాల సమితితో ప్రోత్సహించవచ్చన్నారు. భారతలోని సతీ్‌షధావన అంతరిక్ష కేంద్రం ఆంధ్రప్రదేశ, తమిళనాడు, పుదుచ్చేరి, రాషా్ట్రల్లో అంతరిక్ష కార్యకలాపాలను గరిష్ఠంగా చేరుకోవడానికి, భారత అంతరిక్ష కేంద్ర కార్యక్రమానికి సంబంధించిన అంశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ కార్యకలాపాలను ఇస్రో నిర్వహి స్తోందన్నారు. ఈఏడాది శ్రీహరికోట, అమరావతి, పుట్టపర్తి, విజయనగరం, వెల్లూరు, చెన్నై, కారైకాల్‌, కటక్‌ వంటి ఎనిమిది నగరాల్లో నిర్వహించిన వేడుకలలో అన్నిపోటీలు అనలైన, ఆఫ్‌లైన మోడ్‌లో జరిగాయన్నారు.  ఇస్రో ప్రాథమిక దృష్టి సామాన్యులకు మరిన్ని ప్రయోజ నాలను అందించడమేనన్నారు. విపత్తునిర్వహణ, వాతావరణం అంచనా, మత్స్యకారులకు సముద్రనావిగేషన, ఓషనోగ్రఫీ, టెలీమెడిసిన, టౌనప్లానింగ్‌, కమ్యూనికేషన, డీటీహెచ, మొబైల్‌ పోనలకు కనెక్టివిటీ, ఉపగ్రహాలను ప్ర యోగించడం ద్వారా ఇస్రో ప్రశంసనీయమైన సేవలను అందిస్తోందన్నారు. భారతీయ గగనౌట్‌ను అంతరిక్షంలోకి పంపాలనే మన ప్రధాని మోదీ కలను సాకారం చేసే విధంగా ఎస్‌డీఎ్‌ససీ, ఎస్‌హెచఏఆర్‌, ఇస్రో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని గవర్నర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌, సత్యసాయి యూనివర్సిటీ చాన్సలర్‌ చక్రవర్తి, కలెక్టర్‌ బసంతకుమార్‌, ప్రొఫెసర్‌ సంజీవి, వైస్‌చాన్సలర్‌ సెంఽథిల్‌కుమార్‌, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్యెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓలు భాగ్యరేఖ, తిప్పేస్వామి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


Read more