ఎన్నికల్లో జగనకు గుణపాఠం చెబుతాం

ABN , First Publish Date - 2022-12-10T00:20:53+05:30 IST

పెన్షనర్లకు అన్యాయం చేయా లని చూస్తే వచ్చే ఎన్నికల్లో జగనకు గుణపాఠం చెబుతామని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్‌ హెచ్చరించారు. పదో తేదీ వచ్చినా పెన్షన అందడం లేదంటూ కలెక్టరేట్‌లోని ట్రెజరీ, బుడ్డప్పనగర్‌లోని సబ్‌ ట్రెజరీ కార్యాలయాల వద్ద పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసనకు దిగారు.

ఎన్నికల్లో జగనకు గుణపాఠం చెబుతాం
ఖజానా కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పెన్షనర్లు

- పెన్షనర్ల పథకాలు ఊడగొట్టిన కోతల ప్రభుత్వమిది

- పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్‌

- ట్రెజరీ, సబ్‌ ట్రెజరీ కార్యాలయాల ఎదుట ధర్నా

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, డిసెంబరు 9: పెన్షనర్లకు అన్యాయం చేయా లని చూస్తే వచ్చే ఎన్నికల్లో జగనకు గుణపాఠం చెబుతామని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్‌ హెచ్చరించారు. పదో తేదీ వచ్చినా పెన్షన అందడం లేదంటూ కలెక్టరేట్‌లోని ట్రెజరీ, బుడ్డప్పనగర్‌లోని సబ్‌ ట్రెజరీ కార్యాలయాల వద్ద పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసనకు దిగారు. పెద్దనగౌడ్‌ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు వేధించని విధంగా వైసీపీ ప్రభుత్వం పెన్షనర్లను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కొత్త పథకాలేమీ తేకపోగా ఉన్న పథకాలు ఊడగొట్టి కోతల ప్రభుత్వంగా నిలిచిందని మండిపడ్డారు. పెన్షన కోసం ప్రతి నెలా 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ వేచి చూడాల్సిన దయనీయ పరిస్థితిని పెన్షనర్లు ఎదుర్కొంటున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగితే... పెన్షనర్ల ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర నాయకులు స్పందించే పరిస్థితిలో లేకపోవడంతోనే... మా గోడును చెప్పుకునేందుకు నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు. సకాలంలో పెన్షనలు అందక పెన్షనర్ల కుటుంబసభ్యులందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతినెలా ఈహెచఎ్‌స డబ్బులు చెల్లిస్తున్నా ఎలాంటి లాభం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఆర్‌లు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయ పరిస్థితిలో పెన్షనర్లు ఉన్నారన్నారు. పెన్షనర్ల అంత్యక్రియలకు అందించే రూ. 25 వేలు ఆర్థికసాయాన్ని ఎత్తివేసి బాధిత కుటుంబాలకు కన్నీటిని మిగిల్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెన్షనను ప్రతి నెలా 1వ తేదీనే ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓటుతో సీఎం జగనకు సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అనంతరం ట్రెజరీ డీటీఓ సరళా విజయకుమారి, ఎస్‌టీఓ అనంతయ్యలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప, అసొసియేట్‌ ప్రెసిడెంట్‌ ఖలందర్‌, కోశాధికారి రామకృష్ణయ్య, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ప్రభాకర్‌, వైస్‌ ప్రెసిడెంట్లు మహమ్మద్‌, నారాయణ, రగురామ దయాల్‌, తిప్పన్న, డేనియల్‌ ప్రభాకర్‌, రమే్‌షకుమార్‌, జాయింట్‌ సెక్రటరీలు జయరామ్‌, క్రిష్టప్ప, పుల్లప్ప, వరదరాజులు, చంద్రశేఖర్‌రెడ్డి, వేణుగోపాల్‌తో పాటు పలువురు పెన్షనర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:21:06+05:30 IST