బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోతే ధర్నా చేపడతాం : టీడీపీ

ABN , First Publish Date - 2022-11-15T23:58:25+05:30 IST

మండలంలోని వివిధ గ్రామాల్లో పెన్నానదిపై బ్రిడ్జి, కల్వర్టు పనులను ప్రభుత్వం వెంటనే పూర్తిచేయకపోతే ధర్నా చేస్తామని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి హెచ్చరించారు.

బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోతే ధర్నా చేపడతాం : టీడీపీ

రొద్దం, నవంబరు 15: మండలంలోని వివిధ గ్రామాల్లో పెన్నానదిపై బ్రిడ్జి, కల్వర్టు పనులను ప్రభుత్వం వెంటనే పూర్తిచేయకపోతే ధర్నా చేస్తామని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి హెచ్చరించారు. మంగళవారం ఆయన ఆర్‌మరువపల్లి లోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. మూడేళ్లుగా పెనుకొం డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభివృద్ధి పనులను పక్కనబెట్టి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రాకపోకలకు ప్రజలు అష్టకష్టాలు పడుతుం టే, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. రొద్దం పెన్నానదిలో వెళ్లే దారిలో నాలుగేళ్ల క్రితం టీడీపీ ప్ర భుత్వ హయాంలో పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టామన్నారు. 85 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు చేసేందుకు వైసీపీ ప్రభుత్వానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్నించారు. చిన్నకోడిపల్లి వద్ద పెన్నానదిపై బ్రిడ్జి నిర్మించాలన్నారు. పెన్నానదిలో నీరుప్రవహిస్తే చిన్నకోడిపల్లి వాసుల రాకపోకలు స్తంభిస్తాయన్నారు. అలా గే గొబ్బరంపల్లి, సానిపల్లి మధ్యన ఓ కల్వర్టు, గొబ్బరంపల్లి, పాతర్లపల్లి మధ్య కల్వర్టు తెగిపోయి ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బంది గా మారిందన్నారు. చిన్నమంతూరు నల్లగుంటవంకపై కల్వర్టు ని ర్మించాలన్నారు. వైసీపీ అధికారం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి శూ న్యంగా మారిందన్నారు.

సమావేశంలో టీడీపీ పార్లమెంట్‌ అధికార ప్రతినిధి నరసింహులు, పెనుకొండ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు చిన్నప్పయ్య, కన్వీనర్‌ నరహరి, పార్లమెంట్‌ తెలుగు యువత ఉపాధ్యక్షులు హరీష్‌, టీఎనటీయూసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, మురళి, చంద్రశేఖర్‌ నాయుడు, సర్పంచులు నాగరాజు, మంజు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:58:25+05:30 IST

Read more