శాంతిభద్రతలను పరిరక్షిస్తాం

ABN , First Publish Date - 2022-04-05T06:32:53+05:30 IST

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయమని అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాష్‌ స్పష్టం చేశారు.

శాంతిభద్రతలను పరిరక్షిస్తాం

నూతన డీఐజీ రవిప్రకాష్‌

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 4: శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయమని అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాష్‌ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ ఫక్కీరప్ప పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ విలేకరులతో మాట్లాడారు. కానిస్టేబుల్‌ మొదలు ఇనస్పెక్టర్‌ వరకు చట్టబద్ధంగా పనిచేసేలా, ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. నేరాలు జరగకుండా, ప్రజలు శాంతియుతంగా జీవించే వాతావరణ కల్పిస్తామని తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో యువ ఎస్పీలు ఉన్నారని, మంచిగా పనిచేయాలని సూచించారు. పోలీసులు స్పందించే తీరును బట్టే ప్రజలు సమస్యలు చెప్పడానికి ముందుకొస్తారని అన్నారు. దిశ యాప్‌ అమలు,  మహిళల భద్రతకు కూడా పెద్దపీట వేస్తామన్నారు. ఇతర శాఖల  తరహాలోనే పోలీసు శాఖలోనూ 20 శాతం వరకు అవినీతి ఉంటుందని, దీనిపై దృష్టి సారిస్తామని తెలిపారు. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది డీఐజీకి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more