-
-
Home » Andhra Pradesh » Ananthapuram » We have not been able to do any development work for two years-NGTS-AndhraPradesh
-
రెండేళ్లుగా ఏ ఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయాం
ABN , First Publish Date - 2022-10-01T06:36:32+05:30 IST
‘తాము కౌన్సిలర్లుగా ఎన్నికై రెండేళ్లు గడుస్తోంది. వార్డుల్లో ఇప్పటికీ ఏఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయాం’ అంటూ కౌన్సిలర్లు సభలో ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని ని ర్వహించారు.

సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలం
కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ఆవేదన
మడకశిరటౌన, సెప్టెంబరు 30: ‘తాము కౌన్సిలర్లుగా ఎన్నికై రెండేళ్లు గడుస్తోంది. వార్డుల్లో ఇప్పటికీ ఏఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయాం’ అంటూ కౌన్సిలర్లు సభలో ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని ని ర్వహించారు. ఈసందర్భంగా అధికార పక్షానికి చెందిన పలువురు కౌన్సిలర్లు సమస్యలు ఎక్కుపెట్టి, ప్రశ్నల వర్షం కురిపించారు. నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారంటూ నిలదీశారు. పారిశుధ్య పనులు, వీధిదీపాలు, సీసీరోడ్ల నిర్మాణం, తాగునీటి పైప్‌లైన సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని వాపోయారు. కార్యాలయానికి కమిషనర్లు మారుతున్నారేకానీ, తాము ఇచ్చిన వినతులు మాత్రం పరిష్కారం చూపలేక పోతున్నారని ఆవేదన వెళ్లగక్కారు. ఇంతకూ సర్వసభ్యసమావేశాన్ని ఎందుకు నిర్వహిస్తున్నట్లు? అధికారులకైనా స్పష్టత ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాము సమావేశంలో అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యలే పరిష్కరించకపోతే, ఇక ప్రజలు కార్యాలయానికి వస్తే మీరు సమస్యలు పరిష్కరిస్తారా అంటూ పలువురు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు.
కొన్ని వార్డుల్లో మూడు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేయడం లేదని వార్డుల్లో ప్రజలు నిలదీస్తున్నారంటూ కమి షనర్, ఏఈలకు వివరించారు. తాము ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నామని, దీనికి చైర్‌పర్సన, కమిషనర్ సరైన సమాధానం ఇవ్వకుం డా దాటవేస్తున్నారని ఆవేదన చెందారు. వచ్చే కౌన్సిల్ సమావేశానికి అయినా తాము ఇచ్చిన సమస్యలు పరిష్కరించాలని,అలా అ యితేనే కౌన్సిల్ సమావేశాలకు హాజరవుతామని హెచ్చరించారు. లే నిపక్షంలో తమ పదవులకు సైతం రాజీనామా చేయడానికి వెనుకాడమని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు. సమావేశంలో చైర్‌పర్సన లక్ష్మీనరసమ్మ, ప్రభాకర్‌రావు, వైస్‌చైర్మన రామచంద్రారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.