-
-
Home » Andhra Pradesh » Ananthapuram » We are completely lost Help us-NGTS-AndhraPradesh
-
పూర్తిగా నష్టపోయాం.. ఆదుకోండి
ABN , First Publish Date - 2022-09-10T05:35:27+05:30 IST
కాయకష్టం చేసి, పండించిన పంటలో కేవలం పూలు పూచింది కానీ విత్తనాలు ఉన్న కంకులు రాలేదని డబ్బురువారిపల్లి రైతులు శుక్రవారం వ్యవసాయ శాఖ ఏడీ ఎస్ సత్యనారాయణ ఎదుట ఆవేదన చెందారు.

ఓబుళదేవరచెరువు, సెప్టెంబరు 9: కాయకష్టం చేసి, పండించిన పంటలో కేవలం పూలు పూచింది కానీ విత్తనాలు ఉన్న కంకులు రాలేదని డబ్బురువారిపల్లి రైతులు శుక్రవారం వ్యవసాయ శాఖ ఏడీ ఎస్ సత్యనారాయణ ఎదుట ఆవేదన చెందారు. నమ్ముకున్న పంట నట్టేట ముంచిందని, తమను ఆదుకోవాలని కోరారు. డబ్బురువారిపల్లికి చెందిన రైతులు వెంకట రంగారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాము, కుళ్లాయిరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు దాదాపు 40 ఎకరాల్లో ఓ రకానికి చెందిన పొద్దుతిరుగుడు పంట సాగుచేశారు. పంట చేతికొస్తుందన్న సమయంలో కేవలం పువ్వు మాత్రమే వచ్చిందని, అందులో ఒక్క గింజ కూడా రాలేదని ఆవేదన చెందారు. పంటను పరిశీలించిన ఏడీఏ... దీనిపై నంద్యాల శాస్త్రవేత్తలకు నివేదికలు పంపనున్నట్లు చెప్పారు. వారి బృందం వచ్చిన నాణ్యతను పరిశీలిస్తుందన్నారు. తరువాత పంటన ష్టపరిహారంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు ఏఓ ఇలియాజ్‌బాషా, వీఏఏ పవనకుమార్ తదితరులున్నారు.