కృష్ణాజలాలతో చెరువులకు జలకళ

ABN , First Publish Date - 2022-02-19T06:02:12+05:30 IST

మండలంలోని పలు చెరువులు కృష్ణా జలాలతో తొణి కిసలాడుతున్నాయి. రెండో విడత కృష్ణా నది జలాల విడుదలతో చెరువులకు జల కళ సంతరించుకుంది.

కృష్ణాజలాలతో చెరువులకు జలకళ
నిండుకుండలా మడకశిర చెరువు

మడకశిర, ఫిబ్రవరి 18: మండలంలోని పలు చెరువులు కృష్ణా జలాలతో తొణి కిసలాడుతున్నాయి. రెండో విడత కృష్ణా నది జలాల విడుదలతో చెరువులకు జల కళ సంతరించుకుంది. ఇప్పటికే మణూరు, హరేసముద్రం, మడకశిర చెరువులు నిండుకుండలా వున్నాయి. మడకశిర చెరువు మరువ పారుతుండడంతో మరో మూడు చెరువులకు నీరు చేరనున్నాయి. ఛత్రం చెరువుకు సగానికిపైగా నీరు చే రగా, ఈచెరువు నిండిన తర్వాత గౌడనహళ్లి, దయ్యాలపల్లి చెరువులకు నీటిని మ ళ్లించనున్నారు. చెరువులకు నీరు చేరుతుండడంతో దశాబ్దాలకల నెరవేరుతోందని ఆయా ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సరైన వర్షాలు కురవక చెరువులు నెర్రెలు చీలి భూగర్భజలాలు అడుగంటి తాగు, సాగునీటి కోసం ప్రజలు ఇ బ్బందులు పడేవారు. ప్రస్తుతం కృష్ణానది జలాల రాకతో ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. బోరుబావుల్లో కూడా నీటిమట్టం పెరిగి సాగు విస్తీర్ణం ఊపందుకుంటోంది. ఇప్పటికే రబీలో సాధారణ విస్తీర్ణం కన్నా అదనంగా 300 హెక్టార్లు సాగైంది. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలు మళ్లిస్తే ఆ ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్య పరిష్కారం కానుందని రైతులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.


Read more