-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Villagers protest in front of the Secretariat-MRGS-AndhraPradesh
-
సచివాలయం ఎదుట గ్రామస్థుల నిరసన
ABN , First Publish Date - 2022-09-14T04:49:56+05:30 IST
మండలంలోని వైబీ హ ళ్ళి గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది వేళకు విధులకు హాజ రుకావడం లేదని మంగళవారం గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

మడకశిర రూరల్, సెప్టెంబరు 13: మండలంలోని వైబీ హ ళ్ళి గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది వేళకు విధులకు హాజ రుకావడం లేదని మంగళవారం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. విధులకు సక్రమంగా హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని సచివాయం ఎదుట నిరసన చేపట్టారు. పలువురు గ్రామస్థు లు, రైతులు మాట్లాడుతూ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ అధికారితోనే రైతులు, గ్రామస్థులకు ఎక్కువ పనులు ఉం టాయన్నారు. అయితే ఆ అధికారులు ఎప్పుడు విధులకు వస్తారో, రారో తెలియని పరిస్ధితి నెలకొందన్నారు. ప్రతిరోజు వారి కోసం రై తులు, గ్రామస్థులు సచివాలయం ఎదుట గంటల తరబడి వేచిఉంటున్నామని ఆరోపించారు. మంగళవారం ఉదయం 11.45 గంటలు అయినా వారు కార్యాలయానికి రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని, సకాలంలో విధులకు హాజర య్యేలా చూడాలని కోరారు. హనుమంతరాయప్ప మాట్లాడుతూ ఇ టీవల ఆకస్మిక తనిఖీకి వచ్చిన కలెక్టర్‌కు కూడా అధికారుల తీరుపై గ్రామస్థులు ఫిర్యాదు చేశామన్నారు. అయినా విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని వాపోయారు. గ్రామ సచివాయాల పాలన ఏవిధంగా ఉందో అర్థమవుతోందన్నారు.