-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Vigilance raids on meat shops-MRGS-AndhraPradesh
-
మాంసపు దుకాణాలపై విజిలెన్స దాడులు
ABN , First Publish Date - 2022-09-12T05:20:41+05:30 IST
అనంతపురం నగరంలోని మాంసపు దుకాణాలపై విజిలెన్స అధికారులు ఆదివారం దాడులు నిర్వహించా రు. మొత్తం 17 షాపుల్లో తనిఖీలు చేపట్టారు.

తక్కువ తూకాలపై కేసుల నమోదు
అనంతపురం న్యూటౌన, సెప్టెంబరు 11: అనంతపురం నగరంలోని మాంసపు దుకాణాలపై విజిలెన్స అధికారులు ఆదివారం దాడులు నిర్వహించా రు. మొత్తం 17 షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అయితే మూడు షాపుల్లో తక్కువ తూకాలతో వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కమలానగర్‌లోని బాబయ్య చికెన సెంటర్, రామచంద్రనగర్‌లోని షఫి మటన సెంటర్, ఎనటీఆర్ చేపల మార్కెట్‌లోని షాఫ్ నెంబర్ 6, అక్కమ్మకు చెందిన మరో దుకాణంలో తక్కువ తూకాలు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తూకాలు వేయడానికి వినియోగించే యంత్రాలు నిబంధనల మేరకు లేకపోవడంతో రూ.1000 చొప్పున అపరాధ రుసుం విదించారు. దీంతో పాటు సెక్షన 30ఏ, 8జ25 ఆఫ్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2009 ప్రకారం కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స సీఐ వెంకటరమణ, సాయిప్రసాద్, ఏఓ వాసుప్రకాస్, ఎస్‌ఐ బాలకృష్ణయ్య, లీగల్ మెట్రాలజీ ఇనస్పెక్టర్ గౌస్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.