Ap News: వ్యాలీ సెంటర్‌కు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

ABN , First Publish Date - 2022-11-11T11:44:29+05:30 IST

జిల్లాలోని పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో పీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాలీ ట్రైనింగ్ సెంటర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

Ap News: వ్యాలీ సెంటర్‌కు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

అనంతపురం: జిల్లాలోని పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో పీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాలీ ట్రైనింగ్ సెంటర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మహిళలకు ఉపాధి కల్పించే దిశగా కుట్టు మిషన్లు గార్మెంట్స్ పరిశ్రమ టీడీపీ నేత, పీజేఆర్ ట్రస్ట్ అధినేత పెరుమాళ్ళ జీవానంద రెడ్డి ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ కోణంలోనే ఉపాధి నిస్తున్న ట్రైనింగ్ సెంటర్‌కు నిప్పు పెట్టారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడి ఉపాధి లేకుండా చేస్తే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని పీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2022-11-11T11:44:29+05:30 IST

Read more