రేపు కల్టెరేట్‌ వద్ద యూటీఎఫ్‌ ధర్నా

ABN , First Publish Date - 2022-11-21T00:11:48+05:30 IST

పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు.

రేపు కల్టెరేట్‌ వద్ద యూటీఎఫ్‌ ధర్నా

అనంతపురం విద్య, నవంబరు 20: పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో సమా వేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప, జిల్లా గౌరవాధ్యక్షుడు రమణయ్య, అధ్యక్షుడు గోవిందరాజులు, ప్రధానకార్యదర్శి లింగమయ్య ఇతర నాయకులు మాట్లా డారు. పీఆర్సీ చర్చల సందర్భంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో మార్చి 2022లోపు ఆర్థిక బకాయిలన్నీ చెల్లిస్తామని తెలిపార న్నారు. అయితే జూలైలో పీఎఫ్‌ మినహా ఇతర ఏ బకాయిలు చెల్లించలేదన్నారు. ఏపీజీఎల్‌ఐసీ, డీఏ అరియర్లు ,సరెండర్‌ లీవులు, గ్రాట్యూటీ తదితర బకాయిలు 1826 కోట్లు ఉన్నాయన్నారు. ఇలాంటి సమస్యలపై ఽధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-11-21T00:11:48+05:30 IST

Read more