ప్రశాంత పురంలో అశాంతి

ABN , First Publish Date - 2022-10-12T05:22:36+05:30 IST

ప్రశాంతతకు మారుపేరైన హిందూపురం లో అశాంతి నెలకొందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు.

ప్రశాంత పురంలో అశాంతి
విలేకరులతో మాట్లాడుతున్న జనసేన నాయకులు

రామకృష్ణారెడ్డి హత్యతో ప్రజల్లో భయాందోళన : జనసేన


హిందూపురం అర్బన, అక్టోబరు 11: ప్రశాంతతకు మారుపేరైన హిందూపురం లో అశాంతి నెలకొందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ నాయకుడు చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యోదంతంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకున్నాయన్నారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయకులు హిందూపురాన్ని ఫ్యాక్షన ప్రాంతంగా మార్చేశారని ఆరోపించారు. కెనడాలో చదువుకుని, రాజకీయాల మీద ఉ న్న మక్కువతో ప్రజలకు సేవ చేయాలని, జగనపై విశ్వాసంతో వైసీపీలో చేరినట్లు రా మకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు చెబుతున్నారన్నారు. అయితే సొంత పార్టీవారే రామకృష్టారెడ్డిని హతమార్చారని ఆ పార్టీ నాయకులతో పాటు, కుటుంబసభ్యులు బహిరంగంగా ఆరోపిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల వేదన కలిచివేసిందన్నారు. కార్యకర్తలను కాపాడుకోలేని స్థితిలో సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక పోలీస్‌ వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. హత్య జరిగి నాలుగు రోజులు కావస్తున్నా చిన్న క్లూ కూడా కనుక్కోలేకపోయారని అన్నారు. రామకృష్టారెడ్డి ముందుగానే తనపై దాడులు జరుగుతాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేకపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా ఎ దురు దాడులు చేయడం, బాధితులపైనే పోలీసులతో కేసులు పెట్టించి వారిని ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో జనసేన జిల్లాఅధ్యక్షుడు ఎల్‌ఐసీ రమణ, హిందూపురం అధ్యక్షుడు ఆకుల ఉమేష్‌, పరిగి లేపాక్షి, చిలమత్తూరు నాయకులు చక్రి, శేఖర్‌, ప్రవీణ్‌, మోదా శివ, బాబు, మూర్తి, శీన, రంగనాథ్‌ పాల్గొన్నారు.


Read more