అన్యాయంగా అరెస్టు చేశారు..

ABN , First Publish Date - 2022-09-28T05:49:41+05:30 IST

మావాడిని అన్యాయంగా అరె స్టు చేశారంటూ కుటుంబ సభ్యులు పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ లో పెట్రోల్‌ బాటిల్‌తో నిరసనకు దిగిన సంఘటన మంగళవారం క లకలం రేపింది.

అన్యాయంగా అరెస్టు చేశారు..
పోలీసులతో వాదిస్తున్న శివ కుటుంబ సభ్యులు

పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన 

అడ్డుకున్న పోలీసులు 


హిందూపురం, సెప్టెంబరు 27: మావాడిని అన్యాయంగా అరె స్టు చేశారంటూ కుటుంబ సభ్యులు పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ లో పెట్రోల్‌ బాటిల్‌తో నిరసనకు దిగిన సంఘటన మంగళవారం క లకలం రేపింది. బోయపేటకు చెందిన శివపై రెండు కేసులు పెం డింగ్‌లో ఉన్నాయి. తప్పించుకు తిరుగుతుండగా మధ్యాహ్నం ఇంట్లో ఉన్నట్లు సమాచారంతో టూటౌన సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది వెళ్లి అదుపులోకి తీసుకుని స్టేషనకు తరలించారు. దీంతో శివ భార్య సు జాతతో పాటు కుటుంబ సభ్యులు స్టేషన వద్దకు వెళ్లారు. అక్కడ సీ ఐ వారిని ఘాటుగా హెచ్చరించారని, దీంతో వారు అంబేడ్కర్‌ సర్కిల్‌లోకి వచ్చి నిరసన చేపట్టారు. పెట్రోల్‌ బాటిల్‌ తీసుకు వచ్చి మే ము ఆత్మహత్య చేసుకుంటామన్నారు. సమాచారం అందుకున్న వనటౌన ఏఎ్‌సఐ కుమార్‌నాయక్‌ అక్కడికి చేరుకుని, వారి వద్ద నుంచి పెట్రోల్‌బాటిల్‌ లాక్కున్నారు. ఈసందర్భంగా బాధితులు విలేకరుల తో మాట్లాడుతూ బోయపేటలో కొంతమంది తమకు గిట్టనివారు ఫి ర్యాదుచేస్తే శివను పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తే ‘మీరు అడగడానికి ఎవరంటూ’ సీఐ అన్నారన్నారు. దీంతో మేము అతన్ని వదలకపోతే ఆత్మహత్య చేసుకుంటామని చె బితే.. చావుపోండి అని సీఐ అనడంతోనే ఇక్కడికి పెట్రోల్‌ తీసుకుని వచ్చామన్నారు. అన్యాయంగా మా ఆయనపై కేసు నమోదుచేశారన్నారు. అనంతరం వారిని వనటౌన స్టేషనకు తీసుకెళ్లారు. టూటౌన సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా, రెండేళ్ల క్రితం సెబ్‌ ఎస్‌ఐపై దాడి చేసిన కేసుతో పాటు మరోకేసులో నిందితుడిగా ఉన్నాడని, అప్పటి నుంచి పోలీసులకు చి క్కకుండా తిరుగుతున్నాడన్నారు. ఆతన్ని పట్టుకోకపోవడంవల్ల ఉన్నతాధికారులు మాకు మెమోకూడా ఇచ్చారని తెలిపారు. ఇంట్లో ఉన్నారన్న సమాచారంతో ఆయన్ను అరెస్ట్‌ చేశామని, అంతేతప్ప మాకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదన్నా రు. కేసుల్లో ఉన్నవారిని అరె్‌స్ట చేస్తే ఇలా బెదిరించడం సమంజసం కాదన్నారు.  


Updated Date - 2022-09-28T05:49:41+05:30 IST