ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-07-05T06:12:32+05:30 IST

ద్విచక్రవాహనాల దొంగను నగరంలోని వనటౌన పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్‌

8 బైక్‌లు, 20 సిగరెట్‌ బండిళ్ల స్వాధీనం

అనంతపురం క్రైం,జూలై4: ద్విచక్రవాహనాల దొంగను నగరంలోని వనటౌన పోలీసులు అరెస్ట్‌ చేశారు. కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన తిప్పేస్వామిని అరెస్ట్‌ చేసి, అతడి నుంచి 8 బైక్‌లు, 20 సిగరెట్ల బండిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వనటౌన పోలీ్‌సస్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రవిశంకర్‌రెడ్డితో కలిసి అనంతపురం ఇనచార్జ్‌ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అరెస్ట్‌ వివరాలు వెల్లడించారు. 

పార్క్‌ చేసిన వాహనాలే టార్గెట్‌...

కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన తిప్పేస్వామి పాత నేరస్థుడు. నాలుగేళ్ల కిందట ఓ చిన్నారి కిడ్నాప్‌ ఘటనలో డబ్బు డిమాండ్‌ చేసిన కేసులో ఇతని నిందితుడు. అనంతర కాలంలో బైక్‌ల దొంగతనాలకు పాల్పడ్డాడు. అనంతపురం, తాడిపత్రి, కర్నూలు జిల్లా డోన, కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. దుకాణాలు, ఇళ్ల ముందు పార్క్‌ చేసిన మోటర్‌సైకిళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేసేవాడు. అలా మొత్తం 8 మోటార్‌ సైకిళ్లు దొంగలించాడు. అనంతపురంలోని పాతూరులో ఉన్న కిరాణా షాపులో 20సిగరెట్‌ బండిళ్లను దొంగలించాడు. 

అరెస్ట్‌ ఇలా...

  • పాతకేసుల్లోని నిందితులపై నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ ఆదేశాలిచ్చారు. ఇనచార్జ్‌ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీసీఎస్‌  డీఎస్పీ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో వనటౌన సీఐ రవిశంకర్‌రెడ్డి, సీసీఎస్‌ సీఐ వహీద్‌బాషా, ఎస్‌ఐలు సిబ్బంది కలిసి బృందంగా ఏర్పడి నిఘా ఉంచారు. గుత్తిరోడ్డులోని పెట్రోల్‌ బంకు సమీపంలో ఉన్న నిందితున్ని అరెస్ట్‌ చేశారు. దొంగను అరెస్ట్‌ చేయడంలో శ్రమించిన సీఐలతో పాటు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీధర్‌ఫణి, విక్టర్‌, ఫరూక్‌, గార్లదిన్నె హెచసీ ఫిరోజ్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Updated Date - 2022-07-05T06:12:32+05:30 IST