ఓటీఎ్‌సపై రెండు మెగా మేళాలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-01-03T05:30:00+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎ్‌స)పై ఈ నెలలో రెండు మెగామేళాలు నిర్వహించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు.

ఓటీఎ్‌సపై రెండు మెగా మేళాలు నిర్వహించాలి
వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టర్‌ నాగలక్ష్మి 

అనంతపురం వ్యవసాయం, జనవరి 3:  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎ్‌స)పై ఈ నెలలో రెండు మెగామేళాలు నిర్వహించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ భవనలో జేసీలు నిశాంతకుమార్‌, సిరి, నిశాంతి, గంగాధర్‌గౌడ్‌తో కలిసి పలు శాఖల అఽధికారులతో కలెక్టర్‌ వీడియోకాన్ఫరెన్స నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటిదాకా నిర్వహించిన మెగామేళాల్లో లబ్ధిదారుల నుంచి కనీస రుసుం స్వీకరించేందుకు పరిమితమయ్యామనీ, ఈ నెలలో అదనంగా రిజిస్ర్టేషన పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్రాంతి పండుగకు ముందు ఒకటి, తర్వాత మరొకటి నిర్వహించేలా సంబంధిత అధికారులు సిద్ధం కావాలన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా తొలివిడతలో మంజూరైన ప్రతి ఇంటిని నెలాఖరులోగా గ్రౌండింగ్‌ చేసేలా చూడాలన్నారు. వారంలోగా 15-18 ఏళ్ల యువతకు పాఠశాలలు, కళాశాలల్లో వ్యాక్సిన వేయాలన్నారు. ఫీవర్‌ సర్వేలో కొవిడ్‌ లక్షణాలు ఎక్కువగా కనిపించిన ప్రాంతాల్లో కొవిడ్‌ నియమావళిని కఠినంగా అమలు చేయాలన్నారు. రబీ సీజనలో ఈ-క్రాపింగ్‌ను సకాలంలో పూర్తిచేసేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ ప్రేమ్‌చంద్‌, హౌసింగ్‌ పీడీ కేశవనాయుడు, జేడీఏ చంద్రానాయక్‌, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-03T05:30:00+05:30 IST