-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Two lorries stuck on the national highway-NGTS-AndhraPradesh
-
జాతీయ రహదారిపై ఇరుక్కున్న రెండు లారీలు
ABN , First Publish Date - 2022-09-30T06:11:11+05:30 IST
కొడికొండ నుంచి శిర వరకు నూతనం గా నిర్మిస్తున్న జాతీయ రహదారిలో మండలంలోని ధనాపురం సమీపంలో గురువారం రెండు లారీలు ఇరుక్కుపోయాయి.

3 గంటలపాటు రాకపోకలు బంద్
కాలినడకన ప్రయాణికులు
అధ్వానపు రోడ్లతో అవస్థలు
పరిగి, సెప్టెంబరు 29: కొడికొండ నుంచి శిర వరకు నూతనం గా నిర్మిస్తున్న జాతీయ రహదారిలో మండలంలోని ధనాపురం సమీపంలో గురువారం రెండు లారీలు ఇరుక్కుపోయాయి. దీంతో 3 గం టలపాటు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మడకశిర నుంచి హిందూపురం వైపు అధికలోడుతో వస్తున్న లారీ ఇరుక్కుపోయింది. దానికి ఎదురుగా వస్తున్న మరో లారీ కూడా ఇదే మార్గంలో ఇరుక్కుపోయింది. ఎటువైపు వాహనాలు వెళ్లలేక వాహన రాకపోకలు స్తంభించాయి. హిందూపురం నుంచి పావగడ, మడకశిర వెళ్లే వాహనాలు, కేఎ్‌సఆర్టీసీ, పలు ప్రైవేట్ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేసేదిలేక కాలినడకన ప్రయాణికులు హిందూపురం వైపు నుంచి నడుచుకుంటూ వె ళ్లిపోయారు. ప్యాసింజర్ ఆటోలు సైతం వెళ్లలేక గార్మెంట్స్‌కు వెళ్లే కా ర్మికులు రోడ్డుపైనే నిలిచిపోవాల్సి వచ్చింది. రోడ్డు సరిగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోయారు. విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ద్విచక్రవాహనాలు మాత్రమే వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేశారు. ఎక్సాకవేటర్ సాయంతో లారీలను పక్కకు తొలగించి, రాకపోకలను పునరుద్ధరించారు.