రైల్వేపై కరోనా పిడుగు..

ABN , First Publish Date - 2022-01-23T06:23:24+05:30 IST

కరోనా మహమ్మారి.. రైల్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రైళ్లు ఖాళీగా వెళ్తున్నాయి. ఇది రైళ్ల రద్దుకు దా రితీస్తోంది.

రైల్వేపై కరోనా పిడుగు..
ఖాళీగా ఉన్న బోగీ

రైళ్లు ఖాళీ..!

తగ్గిన ఆక్యుపెన్సీ .. రద్దవుతున్న రైళ్లు త్వరలో ఎక్స్‌ప్రెస్‌

రైళ్లు కూడా..?

గుంతకల్లు, జనవరి22: కరోనా మహమ్మారి.. రైల్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రైళ్లు ఖాళీగా వెళ్తున్నాయి. ఇది రైళ్ల రద్దుకు దా రితీస్తోంది. కరోనా భయంతో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఖాళీగా వెళ్తున్నాయి. ఉత్తరాదికి వెళ్లున్న రైళ్లు మినహా ఇతర వాటిలో ప్రయాణికులు పలచబడిపోయారు. కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే కొన్ని ప్యాసింజరు రైళ్లను రద్దు చేశారు. త్వరలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల విషయంగా కూడా ప్రతిబంధకాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దగా ఆదాయంలేని ప్యాసింజరు రైళ్లను నిలిపివేస్తుండగా, రానున్న రోజుల్లో కలెక్షన్లులేని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకూ అదేగతి పట్టనుంది. కొవిడ్‌ ప్రారంభంలో రద్దయిన రైళ్లు ఆరునెలల కిందట పూ ర్తిస్థాయిలో పునఃప్రారంభమయ్యాయి. మరలా కొవిడ్‌ కష్టకాలం రావడంతో పట్టాలెక్కిన రైళ్లు మరలా నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఖాళీ

కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణించేవారు రోజురోజుకీ తగ్గిపోతున్నారు. యూపీ ఎన్నికల సందర్భంగా ఆ రాషా్ట్రనికి వెళ్తున్న రైళ్లు మినహా ఇతర రైళ్లలో జనం అతి తక్కువగా ప్రయాణిస్తున్నారు. యూపీ నుంచి దక్షిణాది రాషా్ట్రల్లో పనులు చేసి జీవనం సాగించడానికి వచ్చిన కూలీలు, వృత్తిదారులు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ కారణంగా మైసూరు-వారణాసి, బెంగుళూరు-ఢిల్లీ, తిరుపతి-ఢిల్లీ వెళ్తున్న యూపీ రైళ్లలో జనం కనిపిస్తున్నారు. మిగిలిన రైళ్లలో పరిస్థితి అఽధ్వానంగా ఉంది. బెంగళూరు-హైదరాబాదు, యశ్వంతపూర్‌- గోరఖ్‌పూర్‌- యశ్వంతపూర్‌ వెళ్లే మూడు రైళ్లు, ముంబై-చెన్నై-ముంబై వెళ్లే 8 రైళ్లు, ముంబై-కోయంబత్తూరు వెళ్లే కుర్లా, అమరావతి, రాయలసీమ, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఖాళీగా వెళ్తున్నాయి. ఇక ఏసీ బోగీల పరిస్థితి  మరీ ఘోరంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ రైళ్లపై కూడా క్యాన్సిలేషన వేటుపడే  అవకాశాలు ఉన్నాయి.


ప్రయాణికులు ఉన్నా..

కరోనా కారణంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణికు ల సంఖ్య తగ్గిపోతున్నా బడుగుజీవులు  మా త్రం ప్యాసింజరు రైళ్లను వినియోగిస్తూనే ఉన్నారు. కరోనా పేరుచెప్పి ప్యాసింజరు రైళ్లను నిలిపివేయడానికి రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వే డివిజనలోని గుంతకల్లు-కర్నూలు, కర్నూలు-డోన, డోన-గుత్తి, కాట్పాడి-తిరుపతి- కా ట్పాడి ప్యాసింజరు రైళ్లను నిలిపివేశారు. వాటిని తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెబుతు న్నా, దానిని కొనసాగించే అవకాశాలున్నాయి. ఇంకా గుంతకల్లు-రేణిగుంట, గుంతకల్లు-తిరుపతి, కదిరిదేవరపల్లి-తిరుపతి, గుంతకల్లు-రాయచూరు తదితర ప్యాసింజరు రైళ్లను అధికారులు నడుపుతున్నారు.Read more