చిత్రావతి వంకలో చిక్కుకున్న ట్రాక్టర్‌

ABN , First Publish Date - 2022-09-10T05:32:17+05:30 IST

మండలపరిధిలోని తిప్పేపల్లి బ్రిడ్జి పైన రాళ్ల లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్‌ చిత్రావతి వంక ఉధృతికి కొట్టుకు పోయింది.

చిత్రావతి వంకలో చిక్కుకున్న ట్రాక్టర్‌
వంకలో చిక్కుకున్న ట్రాక్టర్‌

ధర్మవరం రూరల్‌, సెప్టెంబరు9: మండలపరిధిలోని తిప్పేపల్లి బ్రిడ్జి పైన  రాళ్ల లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్‌ చిత్రావతి వంక ఉధృతికి కొట్టుకు పోయింది. గ్రామ స్థులు తెలిపిన వివరాల మేరకు... బత్తలపల్లికి చెందిన నవీన శుక్రవారం తన ట్రాక్టర్‌లో పునాదిరాళ్లు వేసుకుని ఏలుకుంట్ల గ్రామం నుంచి నుంచి బత్తలప ల్లికి వెళుతున్నాడు. మార్గమధ్యంలోని తిప్పేపల్లి వద్ద చిత్రావతి వంక దాటు తున్నాడు. బ్రిడ్జిపై వంక ఉధృతంగా పారుతోంది. లోతు అంచనా వేయని ట్రాక్టర్‌ డ్రైవర్‌ లోడ్‌తో అలాగే ముందుకెళ్లాడు. బ్రిడ్జిపై పారుతున్న నీటి ఉ ధృతికి ట్రాక్టర్‌ అదుపుతప్పి వంకలోకి కొట్టుకుపోతున్న సమయంలో.... ట్రాక్టర్‌ ఇంజన చక్రం బ్రిడ్జిమీద ఉన్న దిమ్మె అడ్డుపడి నిలిచిపోయింది. వెంటనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ నవీన పక్కకు దూకాడు. వంక సమీపంలో దుస్తులు ఉతుకుతున్న మహిళలు గమనించి తెలపగా గ్రామస్థులు అక్కడికి వచ్చి ట్రాక్టర్‌ డ్రైవర్‌ నవీనను తాళ్ల సాయంతో బయటకు తీశారు. ట్రాక్టర్‌కు దిమ్మె అడ్డురాక పోయుంటే పెనుప్రమాదం జరిగి ఉండేదని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు.


Read more